ఆ రోజున అక్కడ ఇటుక ఉంచేందుకు నేనే స్వయంగా వెళ్తాను: ఫరూక్ అబ్దుల్లా

  • శ్రీరాముడు యావత్ ప్రపంచానికి చెందినవాడు 
  • కేవలం, హిందువులకే పరిమితం కాదు
  • అయోధ్య సమస్య చర్చల ద్వారానే పరిష్కారం కావాలి
నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయోధ్య భూవివాదం కేసు ఈ నెల 10వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీరాముడు యావత్ ప్రపంచానికి చెందినవాడని, కేవలం, హిందువులకే పరిమితం కాదని అన్నారు. అయోధ్య భూ వివాదం సమస్య చర్చల ద్వారానే పరిష్కారం కావాలని, ఈ అంశంపై సంబంధిత వ్యక్తులు కలిసి చర్చించి పరిష్కరించుకోవాలే తప్ప కోర్టులను ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఈ వివాదం పరిష్కారమైన రోజున అక్కడ ఇటుక ఉంచేందుకు తాను స్వయంగా వెళ్తానని చెప్పిన ఫరూక్ అబ్దుల్లా, సాధ్యమైనంత త్వరగా రామాలయం అంశంపై పరిష్కారం కనుగొనాలని సూచించారు. 
Go Back to Shorts
ayodhya
babri mosque
nationa conference
farooq

More Telugu News